మాక్ డ్రిల్ ఏర్పాట్లు పరిశీలన
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్ కాలనీలో ఆదివారం నిర్వహించే విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ఏర్పాట్లను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ శనివారం పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమం జీఎన్‌ఆర్ కాలనీతోపాటు, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట స్టేషన్ అధికారి శివాజీ, సీపీవో జీవరత్నం, డీవైస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్ రాజు, ఉన్నారు.
కొత్త భవనంలోకి రూరల్ ఠాణా
నిర్మల్ రూరల్: నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను నూతన భవనంలోకి మార్చారు. ఎల్లపల్లి శివారులో కొత్తగా నిర్మించిన ఆర్‌ఐ క్వార్టర్స్‌లోకి మార్చినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. కొత్త భవనాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి ఇటీవలే ప్రారంభించారు.


