అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
మామడ: మండలంలోని న్యూసాంగ్వి గ్రా మంలో గురువారం అంతర్జాతీయ వలసదా రుల దినోత్సవం ప్రవాసి మిత్ర లేబర్ యూ నియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యూని యన్ రాష్ట్ర అద్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల మా ట్లాడుతూ మనదేశం నుంచి ఉపాధికోసం వెళ్లి అక్కడ పనిచేసి విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపించి దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని విమర్శించా రు. తిరిగి వచ్చిన గల్ఫ్ కార్మికులకు పునరా వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అశ్విన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనసూయ, నాయకులు గంగాధర్, గీత, సుశీల, రాజేశ్వర్ పాల్గొన్నారు.


