వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. రాత్రి మంచు ఎక్కువగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపాలిటీ ఉద్యోగులందరూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ అప్పిలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ షాహిద్‌మసూద్ సూచించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ప్రతీ విభాగాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య, వారు చేస్తున్న విధులు అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన షోయబ్ అహ్మద్ ప్రాపర్టీని ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా 23, అక్టోబర్ 2025న మ్యుటేషన్ చేశారని హైదరాబాద్ సీడీఎంకు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డీ తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదుదారుడు, అప్లికేంట్ ఇద్దరినీ పిలిపించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా 9100061766 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఆర్డీ వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దేవీదాస్, అధికారులు ఉన్నారు.


