● 129 స్థానాల్లో 60 హస్తం ఖాతాలో.. ● జాబితా విడుదల చేసి
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. బీజేపీ నిర్మల్ నియోజకవర్గంలో 80 స్థానాలు కై వసం చేసుకున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు వచ్చాయని జాబితా విడుదల చేశారు. 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు పోను 19 స్థానాల్లో స్వతంత్రులు గెలిచారని, మిగతా 49 సర్పంచ్ స్థానాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వచ్చాయని వివరించారు. ఎవరి స్థానాలు ఎన్నో వారే ప్రకటించాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమ, సమర్థతకు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర్‌రెడ్డి సండే ఎమ్మెల్యే నుంచి మంత్లీ ఎమ్మెల్యేగా ప్రమోషన్ పొందాడని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని హితవు పలికారు. సమావేశంలో నిర్మల్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్‌రెడ్డి, అబ్దుల్ హాది, సర్పంచులు అక్షర, భూమన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, సాయన్న, రమేశ్, రమేశ్‌రెడ్డి, ఇతర సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు.


