దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్
పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. చాలా వరకు కొత్తవారికి ఛాన్స్ ఇస్తే.. కొన్ని గ్రామాల్లో పాత వారికి లేదా వారి కుటుంబీకులకు అవకాశం ఇచ్చారు. మేజర్ పంచాయతీ అయిన లోకేశ్వరం సర్పంచ్‌గా ఇక్కడి ఓటర్లు దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్ ఇచ్చారు. ఈనెల 14న జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా దార్వాడి కపిల్‌ను 56 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 1995 నుంచి 2000 వరకు దార్వాడి సైదులు సర్పంచ్‌గా పనిచేశారు. 2006లో సైదులు భార్య దార్వాడి లక్ష్మిని ఎంపీటీసీగా గెలిపించారు. ఆమె ఎంపీపీగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో సైదులు కోడలు, కపిల్ భార్య సౌజన్యను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఐదేళ్లు ఆమె సేవలందించారు. తాజాగా కపిల్‌ను గెలిపించారు. – లోకేశ్వరం
సైదులు..
1995లో సర్పంచ్
లక్ష్మి..
2006లో ఎంపీపీ
సౌజన్య..
2019లో సర్పంచ్
కపిల్..
2025లో సర్పంచ్
దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్
దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్
దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్


