అడ్వెంచర్ క్యాంపులో ఆర్జీయూకేటీ వలంటీర్లు
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి చలి ప్రభావం కొనసాగుతుంది. మంచు అధికంగా కురుస్తుంది.
బాసర: 2025–26 విద్యా సంవత్సరానికి జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) అడ్వెంచర్ క్యాంప్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ బిహారీ వాజపేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో డిసెంబర్ 15 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికై న వాలంటీర్లు ఈ ప్రతిష్ఠాత్మక శిబిరంలో పాల్గొంటున్నారు. ఆర్‌జీయూకేటీ బాసర నుంచి కె.ప్రవళిక, బి.వీరమల్లేశ్వర్, కె.సాయిరాహుల్, ఎన్.శివాంశ, ఎం.స్వాతి ఎంపికయ్యారు. వీరితో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.శ్రవణ్ కుమార్ వెళ్లారు. క్రమశిక్షణ, జట్టు సమన్వయం, నాయకత్వం, సహనశీలత, ధైర్యసాహసాలు, జాతీయ ఐక్యతను పెంపొందించేలా సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తారు. శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, సామాజిక బాధ్యతలు అలవాటవుతాయి. అడ్వెంచర్‌లో పాల్గొంటున్న విద్యార్థులను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొపెస్ మురళీ దర్శన్, కోఆర్డినేటర్ టి.రాకేశ్‌రెడ్డి అభినందించారు.


