అడెల్లి మహా పోచమ్మకు కలెక్టర్ పూజలు
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ శ్రీఅడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని కల్టెర్ అభిలాష అభినవ్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుమార్తె పుట్టిన రోజు పురస్కరించుకుని ఉదయమే కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయ సిబ్బంది కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి అమ్మవారి ఫొటో, తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్ ఉన్నారు.


