సర్పంచే సుప్రీం!
న్యూస్‌రీల్
గ్రామ అభివృద్ధిలో కీలకం.. విశేష అధికారాలు కల్పించిన నూతన పంచాయతీరాజ్ చట్టం
గ్రామపంచాయతీ సభలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఆయన లేకపోతే ఉపసర్పంచ్ బాధ్యత నిర్వహిస్తాడు.
పాలకవర్గం పనులను పర్యవేక్షించి, ఫైనాన్సులను ఖర్చు చేసే అధికారం కలిగి ఉంటాడు.
కార్యదర్శి పనులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు.
గ్రామ అభివృద్ధికి నిధుల విడుదలపై చెక్ పవర్ ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సర్పంచులకు నెలకు రూ.6,500 వేల జీతం ఇస్తారు.
నిర్మల్
కొత్త ప్రోగ్రెస్ కార్డులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే సాధారణ ప్రోగ్రెస్ కార్డుల విధానానికి ఇక స్వస్తి పలకనుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ప్రవేశపెట్టనుంది.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
లక్ష్మణచాంద: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. మండలంలో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్ ఉన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామానికి సంబంధించిన సర్వాధికారాలు పంచాయతీవే. గ్రామపంచాయతీలో స ర్పంచే సుప్రీం. గ్రామసభల తీర్మానాలే శాసనాలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీలకు విశాలమైన అధికారాలు కల్పించాయి. ప్రభుత్వాలు. దీంతో స్వయం పాలన మరింత దగ్గరైంది.
అభివృద్ధి వేదికగా గ్రామపంచాయతీ
రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధిదీపాలు వంటి సేవల సమన్వయం గ్రామపంచాయతీ సమావేశాల్లో జరుగుతుంది. సర్పంచ్ అధ్యక్షతన తీసుకునే నిర్ణయాలు గ్రామ చట్టాలుగా అమలవుతాయి. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చులు, ఆదాయ వ్యయాలు గ్రామసభలో తెలియజేస్తారు.
అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు..
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వచ్చిన సర్పంచ్‌పై సభ్యులకు అవిశ్వాసం ప్రకటించే హక్కు ఉండదు. ఇది వారి పదవికి నిర్దిష్ట రక్షణ ఇస్తుంది. అయితే తప్పుడు నిర్వహణ, ఆడిట్ లోపాలు, నిధుల అనవసర వినియోగం, అధికార దుర్వినియోగం పరిస్థితుల్లో కలెక్టర్లకు తొలగించే అధికారం ఉంటుంది. సర్పంచ్ రాజీనామా చేస్తే, జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలి.
సర్పంచ్ స్థానం ఖాళీ అయితే..
సర్పంచ్ పదవి ఖాళీ అయితే 120 రోజుల్లో తిరిగి ఎన్నిక నిర్వహించి కొత్త సర్పంచ్‌ను ఎన్నుకోవాలి. అప్పటి వరకు ఉపసర్పంచ్ తాత్కాలిక బాధ్యతలను నిర్వహిస్తాడు.
సర్పంచ్ బాధ్యతలు
సర్పంచే సుప్రీం!


