అనుబంధం.. చాలా దూరం!
కడెం: జిల్లా కేంద్రాలకు మండలాలు.. మండల కేంద్రాలకు గ్రామాలు దూరంగా ఉండడం సాధారణ మే. గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలు మహా అయితే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటాయి. జిల్లాలో కొన్ని అనుబంధ గ్రామాలకు జీపీలు 3 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్నాయి.
32 కిలోమీటర్ల దూరం..
కడెం మండలం ఉండుంపూర్ పంచాయతీకి రాంపూర్, మైసంపేట్ అనుబంధ గ్రామాలుగా ఉన్నా యి. ఈ గ్రామాలో కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఉండడంతో ఏడాది క్రితం ధర్మాజీపేట్ సమీపంలోకి తరలించారు. దీంతో గ్రామ పంచాయతీకి 32 కి.మీ దూరం వెళ్లాయి. ఈ గ్రామంలో సుమారు 94 ఇళ్లు, 350 ఓటర్లు, 400 జనాభా ఉంది.
కడెం కట్ట దాటాలి
కడెం మండలం డ్యాంగూడ గ్రామం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. డ్యాంగూడ గ్రామస్తులు గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే కడెం ప్రాజెక్టు దాటాలి. లేదంటే పాండ్వపూర్ మీదుగా ఐదు కిలోమీటర్లు వెళ్లాలి. ఇక్కడ సుమారు 13 కుటుంబాలు, 50 మంది జనాభా ఉంటుంది.
జీపీకి దూరంగానే అటవీ గ్రామాలు
కడెం మండలంలోని గండిగోపాల్‌పూర్, మిద్దెచింత గ్రామాలు ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీకి రావాలంటే సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. ఖానాపూర్ మండలం కోలాంగూడ జీపీ పరిధిలోని కుసుంపూర్ గ్రామస్తులు పంచాయతీకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు వెళ్లాలి. దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం గొండుగూడ వాసులు గ్రామ పంచాయతీ వెళ్లాలంటే 18 కిలోమీటర్లు ప్రయాణించాలి.
అనుబంధం.. చాలా దూరం!


