ఎన్నికల ఖర్చు లెక్క చెప్పాలి
కుంటాల: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చులు చేయవద్దని జిల్లా ఎన్నికల ఖర్చుల అధికారి కేబీ.మనోహర్‌రాజు సూచించారు. కుంటాల రైతు వేదికలో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చుపై ఆదివారం అవగాహన కల్పించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఖర్చు పెడితే అభ్యర్థిపై వేటుపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతీరోజు ఖర్చు పెట్టిన వివరాలు తమకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అదనపు అధికారి అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, సహాయ పరిశీలకులు లలిత, కృష్ణయ్య, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.


