పారదర్శకంగా బిల్లులు చెల్లించాలి
ఖానాపూర్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు పారదర్శకంగా చెల్లించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ అన్నారు. మండలంలో పాతఎల్లాపూర్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు వడ్లూరి సుదర్శన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గజేందర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 190 ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, గోవింద్‌నాయక్, రవికాంత్, వాహిద్‌ఖాన్, జాదవ్ వెంకట్‌రావు, ఇర్ఫాన్‌షేక్, రాజేశ్‌నాయక్, వెంకటేశ్వరరావు, రమాదేవి, శ్రీనివాస్, బాలాజి, గంగాధర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


