తలకుగాయం.. ప్రాణాంతకం
చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. బైక్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదం జరిగితే 80 శాతం వరకు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మిగితా గాయాల కన్నా తలకు తలగిన గాయాలు ప్రాణాంతకం.
– డాక్టర్ మనోజ్ భరత్, న్యూరో ఫిజీషియన్
హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ యాక్టివ్ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తాం. – దుర్గాప్రసాద్, జిల్లా
రవాణా శాఖ అధికారి
తలకుగాయం.. ప్రాణాంతకం


