పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
దస్తురాబాద్: గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో పలు కాలనీలను పరిశీలించి పారిశుద్ధ్యం నిర్వహణ గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త సేకరిస్తున్నారా అని ఆరా తీశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే పన్నులపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్ దారులకు నోటీసులు పంపించాలని ఆదేశించారు. అంతకుమందు పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల సామగ్రిని, గ్రామపంచాతీ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. డీపీవో వెంట మండల ఎంపీడీవోవోలు సునీత, రమేశ్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీవో రమేశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


