కొనుగోళ్లకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు వేళాయె

Oct 29 2025 9:10 AM | Updated on Oct 29 2025 9:10 AM

కొనుగ

కొనుగోళ్లకు వేళాయె

బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 8లోu ● మంత్రి తుమ్మల ఆదేశం

న్యూస్‌రీల్‌

నేడు తెరుచుకోనున్న కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 317 కేంద్రాల ఏర్పాటు ధాన్యం సేకరణ లక్ష్యం 1.69 లక్షలమెట్రిక్‌ టన్నులు

నిర్మల్‌

ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు

కార్తీకమాసం సందర్భంగా ఆదిలాబాద్‌ ఆర్టీ సీ రీజియన్‌ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు.

పత్తిలో 12 శాతం తేమ ఉండాలి

కుంటాల: పత్తిని మిల్లులకు తరలించేటప్పుడు తేమ 12 శాతం మించకుండా రైతులు చూసుకోవాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను ఆదేశించారు. కుంటాల మండలం కల్లూరు రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందిస్తుందని అన్నారు. ప్రతీ రైతు కిసాన్‌ కపాస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సలహాలు, సందేహాల కోసం1800 599 5779 టోల్‌ ఫ్రీ నంబర్‌ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, భైంసా ఏడీఏ వీణ, ఏఈవో గణేశ్‌, రైతులు పాల్గొన్నారు.

లక్ష్మణచాంద: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్‌లో వానాకాలం వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు మండలాల్లో రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం మాయిశ్చర్‌ వచ్చేలా ఆరబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వరి సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

1.20 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారు 400 గ్రామాల్లో ఈ వానాకాలం 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా ముధోల్‌, బాసర, లోకేశ్వరం, దిలావర్‌పూర్‌, లక్ష్మణచాంద, దిలావర్‌పూర్‌, సోన్‌ మండలాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు. కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 317 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, డీసీఎంఎస్‌ కేంద్రాలు 21, పీఏసీఎస్‌ 129, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

నేటి నుంచి కొనుగోళ్లు..

ముధోల్‌ మండలంలో బుధవారం నుంచి వరి కొ నుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు వెల్ల డించారు. మిగిలిన మండలాల్లో పంట కోత పూర్తయ్యే కొద్దీ కేంద్రాలు క్రమంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం 1.69 లక్ష మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించడమే లక్ష్యంగా నిర్ణయించారు.

గన్నీ సంచులు, వసతులు సిద్ధం

ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులు, తూక యంత్రాలు, రవాణా వాహనాలు లాంటి అ న్ని వసతులు కల్పించినట్లు అధికారులు చెప్పారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యం విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌ అందజేయనుందని అధికారులు తెలిపారు. రైతులు మధ్యవర్తుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధారణ మార్కుల కేంద్రాల్లోనే విక్రయం చేయాలని పిలుపునిచ్చారు.

సర్వం సిద్ధం

జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సాగు అయిన వరి ధాన్యం సేకరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదేశాల మేరకు జిల్లాలో 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.69 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం.

– సుధాకర్‌, డీఎం పౌరసరఫరాల శాఖ

జిల్లా సమాచారం...

ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 159

పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలు 129

డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాలు 21

జీసీసీ కొనుగోలు కేంద్రాలు 08

మొత్తం వరి కొనుగోలు కేంద్రాలు 317

మొత్తం వరి ధాన్యం సేకరణ లక్ష్యం

1.69 లక్షల మెట్రిక్‌ టన్నులు

సాధారణ రకం వరి ధాన్యం ధర

క్వింటాల్‌కు రూ.2,369

ఏ గ్రేడ్‌ వరి ధాన్యం రూ. 2,389

కొనుగోళ్లకు వేళాయె1
1/2

కొనుగోళ్లకు వేళాయె

కొనుగోళ్లకు వేళాయె2
2/2

కొనుగోళ్లకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement