మక్కలు తూకం వేయడం లేదని ఆందోళన
ఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొ నుగోలు కేంద్రంలో మక్కలు తూకం వేయడం లేదని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. కడెం మండలం అల్లంపెల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రెండురోజుల క్రితం 600 క్వింటాళ్ల మక్కలను 15 ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చారు. అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిర్వాహకులు తూకం వేయకుండా తేమ శాతం, నాణ్యత పేరిట పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఆందోళనలో రైతులు పరశురాం, సృజన్‌లాల్, పెరమన్న, రిజేశ్, మల్లేశ్, పోశన్న, రాజారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.


