అంతటా వేధింపులే! | - | Sakshi
Sakshi News home page

అంతటా వేధింపులే!

Oct 30 2025 7:43 AM | Updated on Oct 30 2025 7:43 AM

అంతటా

అంతటా వేధింపులే!

గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 8లోu

న్యూస్‌రీల్‌

గడప దాటిన నుంచి గండమే

కంటిచూపుతోనే నరకయాతన

చిన్నారుల నుంచి పెద్దల దాకా

వెలుగులోకి రాని ఘటనలెన్నో..

వేధింపుల నివారణ కమిటీలేవి?

నిర్మల్‌

సురక్షితంగా ప్రయాణించేలా..

ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ తరగతు ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

సత్వర పరిష్కారం చూపాలి

భైంసాటౌన్‌: బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించి, వారికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది మంది నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని భరోసా కేంద్రంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌తో వివిధ కుటుంబా ల్లోని వివాదాలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం షీ టీం పాత్రను అభినందించారు. అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్‌ ఉన్నారు.

నిర్మల్‌: జిల్లా కేంద్రానికి చెందిన ఓ గృహిణి ఎప్పటికప్పుడు తమ పిల్లల డ్యాన్సులు, కార్యక్రమాల వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేది. కాస్త అందంగా ఉన్న ఆమైపె ఓ ప్రభుత్వ ఉద్యోగి కన్నేశాడు. సోషల్‌ మీడియాలో ఆమెను ఫాలో అయ్యాడు. తన పిల్లలను ప్రోత్సహించేలా కామెంట్లు పెడుతూ క్రమంగా ఆమె పర్సనల్‌ ఫోన్‌నంబర్‌ సంపాదించాడు. సెల్‌నంబర్‌కూ మొదట్లో మంచోడిలా మెసేజ్‌లు పెట్టేవాడు. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగి కదా.. మంచోడేమోనని గుడ్డిగా నమ్మింది. అతడి మెసేజ్‌లకు రిప్లయ్‌ ఇస్తూ వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్నిరోజుల తర్వాత సదరు ఉద్యోగి అసలు రూపాన్ని క్రమంగా బయటపెట్టడం ప్రారంభించాడు. కాస్త ఆలస్యమైనా.. అతని దుర్బుద్ధిని తెలుసుకున్న ఆమె ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌లో పెట్టడమే కాకుండా భయంతో తన సోషల్‌ మీడియా అకౌంట్‌లనూ క్లోజ్‌ చేసుకుంది. బయట సమాజంలోనే కాదు, ‘సోషల్‌ మీడియా’లోనూ ఆ డవాళ్లను వదిలిపెట్టడం లేదు. ఇక్కడా.. అక్కడా.. అని కాదు. ఎక్కడైనా.. వేధింపులు తప్పడం లేదు.

ఎక్కడైనా తప్పని వేధింపులు

సర్కారు ఆఫీస్‌లో శ్రమించే ఉద్యోగిని నుంచి షా పింగ్‌మాల్‌లో చెమటోడ్చే వేతనజీవి వరకు.. కాలేజీలో బోధించే అధ్యాపకురాలి నుంచి బడిలో చదివే విద్యార్థిని దాకా.. ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వింతపశువుల్లా మారిన ఉపాధ్యాయులు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. ఈ ఏడాదిలోనే నర్సాపూర్‌(జీ)లో ఇద్దరు, బాసరలో ఒకరు బయటపడ్డారు. ఇలా.. బ యటపడకుండా ఉన్నవారెందరో. ప్రైవేట్‌ సంస్థలు, దుకాణాల్లోనే కాదు, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఆ డవారికి వేధింపులు తప్పని దుస్థితి జిల్లాలో ఉంది.

ధైర్యంగా ముందుకు రావాలి

మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురవుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలపై శాఖాపరంగా కఠినచర్యలు తీసుకుంటున్నాం. భరోసా కేంద్రం, షీ టీమ్‌లు, పోలీసు అక్క కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. బాధితులు ధైర్యంగా ముందుకురావాలి. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచి నిందితులపై కఠినచర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ జానకీ షర్మిల, ఎస్పీ

ఆడవారికి తప్పని వేధింపులు

కమిటీలు.. ఎక్కడా?

మహిళల కోసం ఎన్నో చట్టాలున్నాయి. వాటిపై అవగాహన లేకపోవడంతోనే చాలామంది ఇంకా బాధితులుగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కనీసం పదిమంది మహిళలు పనిచేసే చోట వేధింపుల నివారణ కమిటీ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌.. ఏ కార్యాలయమైనా..

ఏ పనిచోటైనా మహిళలపై వేధింపుల నివారణకు ఇలాంటి ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ.. జిల్లాలో కలెక్టరేట్‌ మొదలు ఎక్కడా ఇలాంటి కమిటీలు లేకపోవడం గమనార్హం. ఘటనలు జరిగినప్పుడే సంబంధిత అధికారులు కమిటీలు వేసి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు.

అంతటా వేధింపులే!1
1/2

అంతటా వేధింపులే!

అంతటా వేధింపులే!2
2/2

అంతటా వేధింపులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement