పోలీసులకు వ్యాసరచన పోటీ
నిర్మల్‌చైన్‌గేట్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఏఆర్ ముఖ్య కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కానిస్టేబు ల్ నుంచి ఏఎస్సైలకు ‘పని ప్రదేశంలో లింగ వి వక్ష’ అంశంపై, ఎస్సై నుంచి ఆపై స్థాయి అధి కారులకు ‘గ్రౌండ్ లెవెల్‌లో పోలీసులను బలో పేతం చేయడం’ అంశంపై పోటీలు నిర్వహించ గా ఐదుగురు ఆర్‌ఎస్సైలు, 46మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు ముగ్గురిని, ఎస్సై నుంచి పైస్థాయి అధికారి వరకు ముగ్గురిని సె లెక్ట్ చేసి రాష్ట్రస్థాయికి పంపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైనవారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్, నగదు రివార్డు అందజేయనున్నారు.


