పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆరో గ్య ఉప కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికా రులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. పనుల పురోగతిని రోజు వారీగా పర్యవేక్షించాలని, నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. అనంతరం వరద నివారణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్ట్‌ల పనుల్లో వేగం పెంచాలని, ఇంజినీరింగ్ శాఖల మధ్య సమన్వయం సాధించి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. పీఆర్ ఈఈ చందుజాదవ్, ఇరిగేషన్ ఈఈ అనిల్, పీఆర్ డీఈ తుకారాం పాల్గొన్నారు.
నిత్యావసరాల కిట్లు అందజేత
వరద నష్ట బాధితులను ఆదుకునేందుకు నెస్లే సంస్థ ప్రతినిధులు 600 నిత్యావసరాల కిట్లను కలెక్టర్ అభిలాష అభినవ్‌కు కలెక్టరేట్‌లో అందజేశారు. సంస్థ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. సంస్థ మేనేజర్ వసీం అహ్మద్, బోస్కో నెట్ ప్రతినిధి సత్యనారాయణ, ధపాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దళారులకు ధాన్యం విక్రయించొద్దు
లోకేశ్వరం: దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని హవర్గ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. కేంద్రంలో అవసరమై న యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్రంలో ని ర్వాహకుల వివరాలు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబ ర్ తదితర వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రికార్డులు పకడ్బందీగా నిర్వహించా లని తెలిపారు. రైతులు ఇబ్బందులెదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్‌లో 9182958858లో సంప్రదించా లని సూచించారు. అదనపు కలెక్టరు (రెవెన్యూ) కి శోర్‌కుమార్, డీసీవో నర్సయ్య, జిల్లా పౌరసరఫరా ల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, ఏవో గిరిరాజ్, ఏఈవో మౌనిక తదితరులున్నారు.


