పక్షవాతానికి జాగ్రత్తలే కీలకం
నిర్మల్‌చైన్‌గేట్: పక్షవాతానికి వయస్సుతో పని లేదని, జాగ్రత్తలే కీలకమని వైద్యులు సూచించారు. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రదీప్ న్యూరో హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో డాక్టర్స్ లేన్ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. షుగర్, బీపీ ఉన్నవారు ఆల్కహాల్, సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పక్షవాతం గురించి ముందస్తు అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని వివరించారు. ర్యాలీలో వైద్యులు దామెర రా ములు, కృష్ణంరాజు, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దేవదాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


