పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
లక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీచర గ్రామానికి చెందిన నైనం శేఖర్ (28) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం ఉదయం గ్రామసమీపంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్‌కు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


