సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య
సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ఆది వారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై గౌతమ్‌పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన, పవార్ బాలాజీ(37) ఆరు నెలల క్రితం, ఉపాధి కో సం సాత్నాల మండలం రామయికి వలస వచ్చాడు. సీస కమ్మరిగా, చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ శని వారం రాత్రి భార్య, అత్తతో గొడవ పడ్డాడు. బామ్మర్దులు వారించారు. ఆదివారం ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ తమ్ముడు సంజయ్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గౌతమ్‌పవార్ తెలిపారు.


