అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో టీచర్
జైనథ్: ఎస్‌సీఈఆర్టీ వారు రూపొందించిన అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయుడికి చోటు లభించింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గోసుల సత్యనారాయణ 6వ తరగతి పాఠ్యాంశంలోని ప్రయోగ కృత్యాలను పుస్తకంలో పొందుపర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొనగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ జ్ఞానం, విలువలు పెంపొందించడంతోపాటు ప్రయోగకృత్యాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ అంశాలు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.


