రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా లింగన్న
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం సాయంత్రం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డి వ్యవహరించారు. 17 పదవులకు నామినేషన్లు స్వీకరించారు. పోటీ లేకపోవడంతో అధ్యక్షుడితోసహా మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న, ప్రధాన కార్యదర్శిగా కె.పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా ఎల్.గంగన్న, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బి.రమేశ్‌కొండు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎ.పోశెట్టి, డాక్టర్ ఎ.నాగేశ్వర్‌రావు, డాక్టర్ ఎ.రజిని, కార్యదర్శులుగా పి.విలాస్, ఎంఏ.కరీం, సంయుక్త కార్యదర్శులుగా రామాగౌడ్, జనార్దన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.రాజేశ్వర్, సుజాతదేవి, ప్రచార కార్యదర్శిగా కె.రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.సత్తయ్య, సీహెచ్.వెంకటేశ్వర్‌రావు, కె.పోశెట్టి ఎన్నికయ్యారు. తాను అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎంసీ.లింగన్న ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇలాగే విశ్రాంత ఉద్యోగులకు సేవలతోపాటు సామాజిక, లీగల్ వాలంటరీ సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


