
మహాత్ముడికి ఘన నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహా త్మాగాంధీ స్వాతంత్య్రం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని స్వాతంత్య్ర సంగ్రామంలో సంఘటితం చేసి ముందుండి శాంతి, అహింస మార్గాలలో నడిపించారన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టరేట్ ఏవో సూర్యారావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.