
అంబరాన్ని తాకిన దసరా సంబురాలు
నిర్మల్/ఖానాపూర్/భైంసాటౌన్: జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నితాకాయి. ఊరూరా వేడుకలు నిర్వహించారు. శమీ పూజ, ఆయుధ పూజలు చేశారు. రాంలీల కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బంగల్‌పేట్ మహాలక్ష్మీ ఆలయం వద్ద విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం దసరా ఉత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేశ్వర్‌రెడ్డి హాజరై మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, వీహెచ్‌పీ నాయకులతో కలిసి శమీపూజ, ఆయుధపూజ, దుర్గాపూజలను చేసి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దసరా ఉత్సవ సభలో మాట్లాడుతూ అధర్మంపై ధర్మం గెలిచిన సందర్భంగా దసరా పండుగను చేసుకుంటామన్నారు. ప్రతీతల్లి జిజియాబాయిలా ఆలోచించాలని, తమ బిడ్డలను శివాజీ, భగత్‌సింగ్‌లా తయారు చేయాలన్నారు. దేశం, ధర్మం, సంస్కృతిపై ఆరాధన భావం పెరిగేలా ఇప్పటి తరాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సమరతా తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, బీజేపీ సీనియర్‌నేత అయ్యన్నగారి భూమయ్య, విశ్వహిందూ పరిషత్ ముఖ్యులు పతికె రాజేందర్, ముప్పిడి రవి, పార్థసారధి, మూర్తి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, ఆంజనేయ యువజన సంఘం అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్, మహాలక్ష్మీ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొడుకుల శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ విజయదశమి అందరికీ విజయాన్ని తెచ్చిపెట్టాలని అకాంక్షించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ మాట్లాడుతూ.. కుల, మతాలను గౌరవించి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే లౌకికదేశంగా భారతదేశం నిలిచిందన్నారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజ్యం సురేశ్ ధ్వజారోహణ చేశారు. పది తలల రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. జమ్మి ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భైంసాలో కిసాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడారు. రాంలీలా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్, శ్యామ్, నాయకులు వెంకటేశ్వర్లు, బీసీరాజన్న, శ్రీనివాస్, రాజు, కృష్ణస్వామి, సంతోష్, లక్ష్మణ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్ని తాకిన దసరా సంబురాలు

అంబరాన్ని తాకిన దసరా సంబురాలు

అంబరాన్ని తాకిన దసరా సంబురాలు

అంబరాన్ని తాకిన దసరా సంబురాలు

అంబరాన్ని తాకిన దసరా సంబురాలు