
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు
లోకేశ్వరం: గ్రామ గ్రామన రాష్ట్రీయ స్వయం సేవ క్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్ వేంపల్లి ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని స్వాధ్యా కేంద్రం అవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయదశమి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రతాప్ మాట్లాడుతూ వచ్చే విజయదశమి దసరా నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హిందుత్వ పరిరక్షణ ఆఖండ భారత నిర్మాణంవైపు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వయం సేవకులను తయారు చేస్తూ దేశ భక్తులుగా నిర్మాణం చేస్తుదన్నారు. నిర్మల్ జిల్లా టోలి సభ్యుడు సంటన్న, సభ్యులు నాగేశ్వర్, శ్రీనివాస్, భూమేష్ ఉన్నారు.