పోయిరా దుర్గమ్మ | - | Sakshi
Sakshi News home page

పోయిరా దుర్గమ్మ

Oct 4 2025 1:32 AM | Updated on Oct 4 2025 1:32 AM

పోయిర

పోయిరా దుర్గమ్మ

శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

భైంసాలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

ఉత్సాహంగా యువత నృత్యాలు

భారీగా పోలీసు బందోబస్తు

నిర్మల్‌

భైంసాటౌన్‌: శరన్నవరాత్రి వేడుల్లో భాగంగా కొలువుదీరిన దుర్గమ్మకు 11 రోజులపాటు భక్తులు పూజలు చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. డివిజన్‌ కేంద్రమైన భైంసా పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక భవానీచౌక్‌లో ప్రతిష్టించిన దుర్గామండలిలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్‌, హిందూ ఉత్సవ సమితి సభ్యులు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా దుర్గా మండళ్ల నిర్వాహకుల ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్రలు శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు, యువతుల కోలాటాలు ఆడుతూ.. అమ్మవారి భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. శోభాయాత్ర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అలరించాయి. భవానీచౌక్‌ అమ్మవారి విగ్రహం పంజేషచౌక్‌ వద్దకు చేరుకోగా, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. శోభాయాత్ర పొడవునా పలుచోట్ల స్వచ్ఛందంగా పులిహోర, అన్నదానం చేశారు. శోభాయాత్ర సందర్భంగా భైంసా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్‌, నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా స్థానికంగానే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సైతం బందోబస్తును పర్యవేక్షిస్తూ, సూచనలు చేశారు. శోభాయాత్ర తీరును డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు. పంజేష చౌక్‌ వద్ద భారీగా బలగాలను మోహరించగా, పంజేషచౌక్‌ నుంచి కిసాన్‌గల్లి మార్గాన్ని మూసివేశారు. స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు

పోయిరా దుర్గమ్మ 1
1/4

పోయిరా దుర్గమ్మ

పోయిరా దుర్గమ్మ 2
2/4

పోయిరా దుర్గమ్మ

పోయిరా దుర్గమ్మ 3
3/4

పోయిరా దుర్గమ్మ

పోయిరా దుర్గమ్మ 4
4/4

పోయిరా దుర్గమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement