
17న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
నిర్మల్‌చైన్‌గేట్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలు ఈనెల 17న నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ.లింగన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్ల సంఘ భవ న సమావేశం మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకున్న నిర్మల్, ఖానాపూర్, ౖభైంసా, ముధోల్ యూనిట్ల కార్యవర్గ సభ్యులు జిల్లా అవుట్ గోయింగ్ బాడీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు.
బీసీలు లేకున్నా రిజర్వేషన్
కుభీర్: మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావుజీ నాయక్ తండాలలో బీసీల ఓటర్లు ఒక్కరు కూడా లేరు. అయినా ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లలో ఈ రెండు గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ చేశారు. ఈ రెండు గ్రామపంచాయతీల రిజర్వేషన్ మార్చాలని అయా తండాల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై వారు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనాభా పరంగా బీసీలు ఉన్నారని, ఓటర్ల పరంగా లేరని ఎంపీడీవో సాగర్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు గ్రామపంచాయతీలలో బీసీ ఓటర్లు లేరని జిల్లా అధికారులకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు.
6న జిల్లా స్థాయి
బాక్సింగ్ జట్ల ఎంపిక
నిర్మల్ రూరల్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం(ఈనెల 6న) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్ 14 ,17 బాక్సింగ్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న, ఎ స్‌జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. వివరాలకు సత్తయ్య 9849 668725, చందుల స్వామి 9966677105ని సంప్రదించాలని సూచించారు.
ఎల్లమ్మ ఆలయంలో పూజలు
భైంసారూరల్: మండలంలోని వానల్‌పహాడ్ ఎల్లమ్మ ఆలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటా దసరా పండగ రోజు జాతర నిర్వహిస్తారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలేకాకుండా పక్క మండలాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.