
‘స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి’
ఖానాపూర్: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మండలాలు, గ్రామాల వారీగా శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంఏ.మజీద్, దయానంద్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గుగ్లావత్ రాజేందర్‌నాయక్, జంగిలి శంకర్, స్వప్నిల్‌రెడ్డి, పుప్పాల శంకర్, గుడిసె రమేశ్, తులాల శంకర్, బాశెట్టి నర్సయ్య, ఆత్రం రాజేశ్వర్, జాదవ్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.