వరి బోనస్‌కు బ్రేక్‌? | - | Sakshi
Sakshi News home page

వరి బోనస్‌కు బ్రేక్‌?

Oct 5 2025 2:10 AM | Updated on Oct 5 2025 2:10 AM

వరి బోనస్‌కు బ్రేక్‌?

వరి బోనస్‌కు బ్రేక్‌?

సన్నవడ్లకు దక్కని ప్రోత్సాహకం నాలుగు నెలలు దాటినా అందని డబ్బులు ప్రస్తుతం కోడ్‌తో నెల రోజులు చెల్లింపు కష్టమే.. జిల్లాకు రావాల్సింది రూ.12.81 కోట్లు

క్ష్మణచాందకు చెందిన రైతు చిన్న రాజేశ్వర్‌ యాసంగిలో పది ఎకరాల్లో సన్న రకం వరి పండించాడు. 200 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాడు. కేంద్ర నిర్వాహకులు సన్న వడ్లుగా నమోదు చేశారు. అ యితే, ధాన్యం మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు ఆయన ఖాతాలో జమయ్యాయి. ధాన్యం అమ్మి నాలుగు నెలలు కావస్తున్నా, బోనస్‌ డబ్బులు మాత్రం రాలేదు.

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో గత యాసంగిలో పండించిన సన్నవడ్లను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. బోనస్‌ వస్తుందన్న ఆశతో అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో కాపలా ఉన్నారు. అయితే ధాన్యం విక్రయించి నా లుగు నెలలు కావస్తున్నా బోనస్‌ జాడ లేదు. తాజా గా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో నవంబరు 11 తేదీ వరకు కోడ్‌ అమల్లో ఉండనుంది. నవంబరులో ఖరీఫ్‌ సీజన్‌ పంట అన్నదాత చేతికి అందనుంది. దీంతో యాసంగి బోనస్‌ ప్రభుత్వం ఇవ్వనట్లేనని రైతులు అంటున్నారు.

రూ.12.81 కోట్లు బకాయి..

జిల్లాలో గత యాసంగి సీజన్‌లో రైతులు వరి సాగు చేశారు. 60 వేలకుపైగా ఎకరాల్లో సన్న రకాలు వేశారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. మొత్తం 1,81,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. ఇందులో 25,623 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి సర్కా రు రైతుల ఖాతాలలో మద్దతు ధరను మాత్రమే జమ చేసింది. బోనస్‌ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో, కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించిన 4,483 మంది రైతులు బోనస్‌ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.12.81 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడిచినా, బోనస్‌పై ఎలాంటి ప్రకటనా లేదు.

స్థానికంలో కీలకం కానుందా..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సాగు భూమి ఉన్న రైతులందరికీ గత నెలలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఎన్నికల నగారా మోగింది. అంతకుముందే బోనస్‌ సొమ్ము ఖాతా ల్లో జమచేసి ఉంటే రైతులకు మేలు జరిగి ప్రభుత్వంపై సదాభిప్రాయం ఉండేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం బోనస్‌ రాని అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందని అధికార, విపక్ష నేతలు మధనపడుతున్నారు.

దొడ్డు రకం ధాన్యం

1,55,377 మెట్రిక్‌ టన్నులు

సన్న రకం ధాన్యం

25,623 మెట్రిక్‌ టన్నులు

జిల్లా సమాచారం...

సేకరించిన మొత్తం ధాన్యం 1,81,000 మెట్రిక్‌ టన్నులు

రావాల్సిన బోనస్‌ డబ్బులు రూ.12.81 కోట్లు

ఒక్క సీజన్‌కే పరిమితమా?

సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌.. ఒక్క సీజన్‌కే పరిమితమైంది. రబీలో సన్నవడ్లు పండించి విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. అన్నదాతలు నిరాశ చెందుతున్నా రు. జిల్లా రైతులు గతంలో రైతులు దొడ్డు రకా లనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాల కు బోనస్‌ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగి లో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే, ప్రభుత్వం బోనస్‌ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్ర భుత్వం ఎకరాకు రూ.500 చొప్పున బోనస్‌ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు వి డుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలోనే బోనస్‌ ఇవ్వని సర్కా రు.. ఖరీఫ్‌లో ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే, రైతులు మళ్లీ దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement