పాలిసెట్‌కు 95 శాతం హాజరు
నిర్మల్ రూరల్: పాలిసెట్ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని 8 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,422 మంది దరఖాస్తు చేసుకోగా, 2,305 మంది(95%)పరీక్షకు హాజరయ్యారు. 117 మంది గైర్హాజరయ్యారు. 1,121 మంది బాలురకు 1,059 మంది, 1,301 మంది బాలికలకు 1,246 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల సమన్వయకర్త, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రమేశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.


