తీహార్‌ జైలులో నిరాహార దీక్ష చేస్తున్న యాసిన్‌ మాలిక్‌

Yasin Malik Goes Hunger Strike Inside Jail Case Not Investigated Properly - Sakshi

న్యూఢిల్లీ: తీహార్‌ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్‌ మాలిక్‌ నిరాహార దీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాలిక్‌ జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్పారు. తన కేసును సంక్రమంగా విచారంచిలేదంటూ ఆరోపణలు చేస్తూ... నిరాహారదీక్ష చేపట్టాడని వెల్లడించారు. వాస్తవానికి మాలిక్‌ నిషేధిత జమ్మూ కాశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ఐతే అతను 2019లో జేకేఎల్‌ఎఫ్‌ని నిషేధించిన కొద్దికాలానికే అరెస్టు అ‍వ్వడమే కాకుండా ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష తోపాటు దాదాపు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. పైగా అతను తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఫిటిషన్‌ దాఖలు చేయనని కోర్టుకు తెలిపాడు కూడా. అంతేగాదు పీపుల్స్‌ డెమెక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబుబా మఫ్తీ సోదరి, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహ్మద్‌ సయ్యద్‌ కుమార్తె రుబయా సయ్యద్‌ని డిసెంబర్‌ 8,1989న తీవ్రవాదులు కిడ్నాప్‌ చేశారు.

ఆ కిడ్నాప్‌ కేసులో మాలిక్‌ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాలిక్‌ పై కిడ్నాప్‌ కేసు తోపాటు 1990 జనవరిలో శ్రీనగర్‌లో నలుగురు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులను కాల్చి చంపిన కేసులో కూడా మాలిక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐతే మాలిక్‌ ప్రస్తుతం ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 

(చదవండి: టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌.. అసలు సినిమా ముందుంది: బీజేపీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top