వైఎస్సార్‌సీపీ ఎంపీలు గొల్ల బాబూరావు, ఎంపీ గురుమూర్తి, తనూజారాణి ధ్వజం
నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి
పరీక్షల నిర్వహణ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల దాకా అక్రమాలే
రూ.15–20 లక్షలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు
సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలి
డీఎస్సీ బాధితులకు అండగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ– 2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దేశంలో ‘నీట్’ లీకేజీ కంటే మెగా డీఎస్సీ అతిపెద్ద కుంభకోణ మని ధ్వజమెత్తారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల భద్రత, మెరిట్ జాబితా, స్పోర్ట్స్ కోటా నియా మకాల్లో పారదర్శకతను పూర్తిగా దెబ్బ తీశారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరి పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురు మూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి డిమాండ్ చేశా రు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తే అత్యున్నత ర్యాంకులు సాధించడం ప్రశ్నపత్రాల లీకేజీకి నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రాల డిజిటల్ యాక్సెస్ ఎవరి నియంత్రణలో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నపత్రంతో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది? అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదని ఎంపీలు విమర్శించారు.
పారదర్శకతకు సమాధి..
పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతుందో డిస్ట్రిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు తెలుసని ఎంపీ గొల్ల బాబూరావు చెప్పారు. ప్రశ్నపత్రాల రూపకల్ప న, పరీక్షల నిర్వహణ బాధ్యతలు డీఎస్సీ కన్వీనర్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఆ బాధ్యతలను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించారన్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో పార దర్శకత దెబ్బతిన్నదన్నారు. పేపర్స్ తయారీ, ప్రింటింగ్, డిజిటైజేషన్.. ప్రతి దశ లోనూ అవుట్‌సోర్సింగ్ వ్యక్తుల్ని పెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో ఎటువంటి ఆరోపణలు, అవకతవ కలకు తావులేకుండా పారదర్శకంగా 1.50 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
కొన్ని సంఘాల సర్టిఫికెట్లతో అసాధారణ నియామకాలు..
నీట్ పేపర్ లీకేజీ కంటే మెగా డీఎస్సీ పెద్ద కుంభకోణ మని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా జీవోలను రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకురావడం, పోస్టుల కేటాయింపులో అవకతవ కలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనబెట్టి కేవలం పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కొన్ని క్రీడా సంఘాలు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా అసాధారణ సంఖ్యలో నియామకాలు జరిగాయ న్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉండగా, జూడో అసోసియేషన్‌కు నారా లోకేశ్‌కు బంధువైన విశాఖ ఎంపీ భరత్ గౌరవాధ్య క్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు.
ఇదే సంఘాల నుంచి జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి సర్టిఫికెట్లు జారీ కావడంనియామకాలపై తీవ్ర అను మానాలు కలిగిస్తోందన్నారు. డీఎస్సీ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. జీవో నెం.3 అమలుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టి స్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు కేవలం 6 శాతమే ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శించారు.
లోకేశ్ రాజీనామా చేయాలి..
మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో స్వతంత్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి, మీడియా వేదికలపై డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టామన్నారు.
దాదాపు 3.5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాసి 16 వేల ఉద్యోగాల కోసం పోటీ పడితే మొత్తం నియామక ప్రక్రియనే అధికార పార్టీకి అనుకూలంగా మార్చారని ఆరోపించారు. 2012 నుంచి అమలులో ఉన్న జీవో నంబర్ 74తో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి ఎంపిక చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకే జీవో నంబర్–4, జీవో నంబర్–47 తీసుకొచ్చారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 384 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కట్టబెట్టిన తర్వాత మళ్లీ జీవో నంబర్–25, జీవో నంబర్–56 ద్వారా పాత నిబంధనలను అమలు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు చెల్లిస్తే టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని బేరం పెడుతూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డు వైరల్ అయిందని ఎంపీ డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా దర్యాప్తు ముందుకు సాగకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి దాగి ఉంది? అని నిల దీశారు. నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నట్లుగానే డీఎస్సీలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ కూడా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.


