Viral Video: యూపీలో ఘోరం.. డెంగ్యూ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌..

Viral Video Claims Dengue Patient Died After Mosambi Juice Drip In UP, Probe Ordered - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చేసింది. డెంగీతో బాధపడుతున్న రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్‌ బ్యాంక్‌ బత్తాయి జ్యూస్‌ను సరాఫరా చేసిందనే వార్త కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసిందనేది ఆరోపణ. బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ  ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్‌ సింగ్‌ అనే నెటిజన్‌ ట్వీట్ చేశాడు. బ్లడ్‌ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ కనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్‌ ఆసుపత్రిలో స్కామ్‌ అని ఓ వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది. ఆసుపత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు  బత్తాయి జ్యూస్‌ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక బత్తాయి జ్యూస్‌ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని, దీనిపై ప్రయాగ్రాజ్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.
చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితెపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top