అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం

Uttar Pradesh Ayodhya Deepotsav Guinness World Record - Sakshi

రామ్‌లీలా, లేజర్‌ షో కూడా 

హాజరుకానున్న ప్రధాని మోదీ

అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్‌లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్‌ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్‌ కమిషనర్‌ నవ్‌దీప్‌ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు.

లేజర్‌ షో, త్రీడీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్‌లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్‌ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది.

చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top