ఈ వెహికల్‌ తెచ్చిన లక్‌ : నెలకు రూ. 45 వేలు | From Unemployed To Rs 45k Month, How An EV Bike Changed This Man Life, Zypp Electric CEO Roadside Chat Goes Viral | Sakshi
Sakshi News home page

ఈ వెహికల్‌ తెచ్చిన లక్‌ : నెలకు రూ. 45 వేలు

May 28 2026 4:18 PM | Updated on May 28 2026 5:31 PM

From unemployed to Rs 45k month How an EV bike changed this man life

జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) వ్యవస్థాపకుడు, సీఈఓ  ఆకాష్ గుప్తా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక సాధారణ రోడ్‌సైడ్ సంభాషణ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఒకపుడు నిరుద్యోగిగా  ఉన్న వ్యక్తి జీవితం ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలు చేయడం ద్వారా అనూహ్యం మలుపు తిరిగింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఎలాంటి అద్భుతమైన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తోందో కళ్లకు కట్టిందంటూ  ఆయన  ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

ఇది కేవలం ఒక వ్యవస్థాపకుడు ,కస్టమర్ మధ్య జరిగే సంభాషణ, ఎపుడైనా జరగవచ్చు..రాత్రి 11 గంటల సమయంలో నడుస్తూ అతనితో సంభాషణ అంటూ  ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుండి నగరానికి వలస వచ్చిన ఒక యువ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉన్న ఆ యువకుడు.. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అద్దెకు తీసుకుని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేస్తూ రోజుకు సగటున రూ. 1,500 సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు.  ఇందులో స్కూటర్ అద్దె  వారానికి రూ. 2,100 (రోజుకు సుమారు రూ. 300) నెలకు దాదాపు రూ. 45,000 వరకు సంపాదిస్తున్నాడు.

ఈ వివరాలు విన్న ఆకాష్ గుప్తా ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ.. ఈ బిజినెస్ మోడల్ ఒక "సూపర్ హిట్" అని, సంప్రదాయ ఉపాధి అడ్డంకులను తొలగించడంలో ఇది నిజమైన "విప్లవాత్మక మార్పు" అని అభివర్ణించారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. ఆ యువకుడు నవ్వుతూ, తను సంపాదించే మొత్తంలో దాదాపు అంతా ఫిరోజాబాద్‌లోని తన కుటుంబానికే తిరిగి పంపుతున్నానని చెప్పాడు.

ఈవీల వల్ల తగ్గిన పెట్టుబడి భారం
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు అద్దెకు దొరుకుతుండటం వల్ల, గిగ్-ఎకానమీ (Gig-economy/Delivery jobs) లోకి ప్రవేశించాలనుకునే కార్మికులకు పెట్టుబడి భారం తగ్గి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, గ్రామీణ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక గొప్ప మార్గంగా నిలుస్తోందని ఈ సంఘటన నిరూపించింది అంటున్నారు  నిపుణులు.

 

 

ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!

సోషల్ మీడియా స్పందన
ఆకాష్ గుప్తా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా , స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. ఈ ఇద్దరు కో-ఫౌండర్స్ , పార్ట్నర్స్ ఆకాష్ , ఆయన భార్య మధ్య ఉన్న ప్రత్యేకత ఇదే. ఆకాష్ ఆ డెలివరీ బాయ్ నేపథ్యం, ఉద్యోగ అనుభవంపై దృష్టి పెట్టగా.. ఆయన భార్య మాత్రం జిప్ (Zypp) వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎదురవుతున్న సౌకర్యాలు, సవాళ్లు వంటి ప్రాక్టికల్ విషయాల గురించి అడిగారు. దీంతో ఈ సంభాషణ మరింత అర్థవంతంగా మారింది అంటూ దంపతులిద్దరిపైనా ప్రశంసలు కురిపించారు. 

ఇదీ స్పందించండి : భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement