akash gupta
-
ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు
జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాష్ గుప్తా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక సాధారణ రోడ్‌సైడ్ సంభాషణ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఒకపుడు నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి జీవితం ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం ద్వారా అనూహ్యం మలుపు తిరిగింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఎలాంటి అద్భుతమైన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తోందో కళ్లకు కట్టిందంటూ ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఇది కేవలం ఒక వ్యవస్థాపకుడు ,కస్టమర్ మధ్య జరిగే సంభాషణ, ఎపుడైనా జరగవచ్చు..రాత్రి 11 గంటల సమయంలో నడుస్తూ అతనితో సంభాషణ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుండి నగరానికి వలస వచ్చిన ఒక యువ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉన్న ఆ యువకుడు.. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అద్దెకు తీసుకుని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్డర్లను డెలివరీ చేస్తూ రోజుకు సగటున రూ. 1,500 సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో స్కూటర్ అద్దె వారానికి రూ. 2,100 (రోజుకు సుమారు రూ. 300) నెలకు దాదాపు రూ. 45,000 వరకు సంపాదిస్తున్నాడు.ఈ వివరాలు విన్న ఆకాష్ గుప్తా ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ.. ఈ బిజినెస్ మోడల్ ఒక "సూపర్ హిట్" అని, సంప్రదాయ ఉపాధి అడ్డంకులను తొలగించడంలో ఇది నిజమైన "విప్లవాత్మక మార్పు" అని అభివర్ణించారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. ఆ యువకుడు నవ్వుతూ, తను సంపాదించే మొత్తంలో దాదాపు అంతా ఫిరోజాబాద్‌లోని తన కుటుంబానికే తిరిగి పంపుతున్నానని చెప్పాడు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash)ఈవీల వల్ల తగ్గిన పెట్టుబడి భారంతక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు అద్దెకు దొరుకుతుండటం వల్ల, గిగ్-ఎకానమీ (Gig-economy/Delivery jobs) లోకి ప్రవేశించాలనుకునే కార్మికులకు పెట్టుబడి భారం తగ్గి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, గ్రామీణ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక గొప్ప మార్గంగా నిలుస్తోందని ఈ సంఘటన నిరూపించింది అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!సోషల్ మీడియా స్పందనఆకాష్ గుప్తా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా , స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. ఈ ఇద్దరు కో-ఫౌండర్స్ , పార్ట్నర్స్ ఆకాష్ , ఆయన భార్య మధ్య ఉన్న ప్రత్యేకత ఇదే. ఆకాష్ ఆ డెలివరీ బాయ్ నేపథ్యం, ఉద్యోగ అనుభవంపై దృష్టి పెట్టగా.. ఆయన భార్య మాత్రం జిప్ (Zypp) వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎదురవుతున్న సౌకర్యాలు, సవాళ్లు వంటి ప్రాక్టికల్ విషయాల గురించి అడిగారు. దీంతో ఈ సంభాషణ మరింత అర్థవంతంగా మారింది అంటూ దంపతులిద్దరిపైనా ప్రశంసలు కురిపించారు. ఇదీ స్పందించండి : భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
మెట్రో స్టేషన్ల వద్ద మొబిసీ సైకిల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018 కొత్త సంవత్సరం నుంచి ఓలా, ఉబెర్ తరహాలోనే సైకిళ్లనూ అద్దెకు తీసుకోవచ్చు. సైకిలే కదా అని తేలిగ్గా తీసేయలేం. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా వస్తున్న డాక్లెస్ సైకిల్ షేరింగ్ యాప్ ఇదే. సాధారణంగా సైకిల్ అద్దెలు ఎలా ఉంటాయంటే.. నిర్దేశించిన ప్రాంతం నుంచే సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలి. అలాగే కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలి. కానీ, మొబిసీలో అలా కాదు.. సైకిల్‌ను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. వినియోగించాక ఎక్కడైనా పార్కింగ్ చేసేయొచ్చు. ఇదే దీని ప్రత్యేకత. జనవరి చివరికల్లా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, ఐఐటీ హైదరాబాద్, పలు ఐటీ కంపెనీల్లో మొబిసీ సైకిల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలను సంస్థ ఫౌండర్ ఆకాష్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఎలా వినియోగించాలంటే? ముందుగా మొబిసీ యాప్‌లో లాగిన్ కావాలి. పేరు, ఫోన్ నంబరుతో పాటు ఆధార్ నంబరును నమోదు చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశాక... ఫోన్ స్క్రీన్ మీద దగ్గర్లో ఉన్న సైకిల్స్ కనిపిస్తుంటాయి. సైకిల్‌ను ఎంపిక చేసి సైకిల్ మీదున్న క్యూఆర్ కోడ్‌ను యాప్‌తో స్కాన్ చేయగానే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. రైడ్ పూర్తయ్యాక ముందుగా చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్లో నుంచి చార్జీని మినహాయించి మిగిలిన మొత్తం కస్టమర్ పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతుంది. వెంటనే కస్టమర్ మొబైల్‌కు ఎంత దూరం ప్రయాణించాం? ఎంత సమయం పట్టింది? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? ఎంత కార్బన్‌ను ఆదా చేశాం? వంటి సమాచారమంతా వస్తుంది. సైకిల్‌ను ఎక్కడ పార్కింగ్ చేయాలి? మొబిసీ పార్కింగ్ రెండు రకాలుగా ఉంటుంది. స్థానికంగా ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయవచ్చు. లేదా కంపెనీ నిర్ణయించిన ప్రాంతాల్లో అంటే కళాశాలలు, మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, జిమ్, పార్క్‌ల వంటి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబిసీ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. పార్కింగ్ చేయనూ వచ్చు. చార్జీ ఎంత?: ప్రతి రైడ్‌కు అరగంటకు రూ.10 చార్జీ ఉంటుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్కైతే రూ.99. రోజుకు 2 రైడ్లు చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.999 చెల్లించాలి. రైడ్ పూర్తయ్యాక రిఫండ్ చేస్తారు. విద్యార్థులకైతే రూ.499 డిపాజిట్. ప్రస్తుతం మొబిసీకి 10 వేల మంది యూజర్లున్నారు. రోజుకు 1,000 రైడ్స్ జరుగుతున్నాయి. జనవరి నుంచి హైదరాబాద్‌లో.. ‘‘ప్రస్తుతం గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 500 సైకిళ్లున్నాయి. మరో 10 రోజుల్లో చండీగఢ్, కోల్‌కతా, పుణేల్లో ఒక్కో నగరంలో 150 సైకిళ్లతో సేవలను ప్రారంభిస్తున్నాం. జనవరి చివరికల్లా హైదరాబాద్‌లో మొబిసీ సైకిళ్లను అందుబాటులోకి తెస్తాం. తొలిదశలో 300 సైకిళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఐఐటీ–హైదరాబాద్, ఎస్టీపీఐ, మెట్రో రైల్ సంస్థలతో చర్చలు జరిపాం. మొత్తంగా మార్చి నాటికి 5 వేల సైకిళ్లకు చేరాలని లకి‡్ష్యంచాం. 6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ.. గుర్గావ్లో కంపెనీ ప్రారంభించే సమయంలో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఈక్విటీ ఇన్వెస్టర్ రూ.3.25 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఒకరిద్దరు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో సేవలకు కొత్తగా మరో 8 మందిని తీసుకుంటున్నాం’’ అని గుప్తా వివరించారు. -
ఎయిర్ హోస్టెస్‌లతో అనుచిత ప్రవర్తన, అరెస్ట్
నాగపూర్ : మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు (23) ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముంబై నుంచి నాగపూర్ వస్తున్న జెట్ ఎయిర్ వేస్‌లో శనివారం చోటుచేసుకుంది. హార్ట్‌వేర్ వ్యాపారి ఆకాశ్ గుప్తా ముంబై నుంచి నాగపూర్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి భోజనం సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్‌ల చేతులు పట్టుకుని లాగి, అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో వారు ఈ విషయాన్ని క్రూ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారితో కూడా ఆకాశ్ గుప్తా వాగ్వివాదానికి దిగటంతో కెప్టెన్ ఈ విషయాన్ని బాలఘట్ (మధ్యప్రదేశ్) సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని, అనంతరం సోనేగావ్ పోలీసులకు అప్పగించారు. ఆకాశ్ గుప్తాపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని అదుపు చేసేందుకు ప్లాస్టిక్ హ్యాండ్ కప్స్ (సంకెళ్లు) వేసేందుకు విమానయాన సంస్థలకు 2016 జనవరి నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే.


