సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కలకలం

Two South African Strains of Covid 19 Virus In Bellary - Sakshi

అన్నా చెల్లెలికి కరోనా వైరస్‌ నిర్ధారణ

సాక్షి బళ్లారి: రాష్ట్రంలోకి సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ వైరస్‌ అడుగు పెట్టడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లూ విలయతాండవం చేసిన కరోనా తగ్గుముఖం పట్టిందని ఊరట చెందుతున్న నేపథ్యంలో కొత్త రకం వైరస్‌ ప్రబలడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వివరాలు...గత నెల 17న దుబాయ్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్న అన్నాచెల్లెలికి ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

బళ్లారికి చేరుకున్న ఇద్దరికీ గతనెల 20న జ్వర లక్షణాలు కనిపించడంతో  మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలను బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రిలోని ప్రయోగశాలకు పంపించగా సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కరోనా సోకినట్లు ధ్రువపడినట్లు జిల్లా అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కాన్నారు. బాధితులను బళ్లారిలోని ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స అందించి హోం క్వారంటైన్‌లో ఉంచారు.

శివమొగ్గలో సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు లేవు
శివమొగ్గ: దుబాయ్‌కు వెళ్లి వచ్చిన శివమొగ్గకు చెందిన 53 సంవత్సరాల వయసున్న వ్యక్తికి సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ లేదని  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి. కే.ఎస్‌. ఈశ్వరప్ప తెలిపారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  మెగ్గాన్‌ అస్పత్రికి వెళ్లి విచారించగా దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి కరోనా లేదని,  వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారన్నారు. అతన్ని కలిసిన 39 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగిటివ్‌ వచ్చిందన్నారు. కాగా  శివమొగ్గ జిల్లా అరోగ్య,శాఖ ఆధికారి డాక్టర్‌ రాజేష్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చదవండి:
పుణేలో కోవిడ్‌ ఆంక్షలు   
కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్‌ బంద్!‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top