ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ సెంట్రల్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

Telangana CM KCR inaugurate BRS central office In Delhi Updates - Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆయన ఆఫీస్‌ రిబ్బన్‌ను కట్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్‌ విహార్‌ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్‌ భేటీ అయ్యారు.

మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్‌ గ్రౌండ్‌లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్‌తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్‌ గ్రౌండ్‌లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్‌, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్‌ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్‌, పేషీ, కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్‌ రూమ్‌లను సిద్ధం చేశారు. సూట్‌ రూమ్‌లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు. 

ఆంక్షలతో ఆలస్యం
ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 2021 సెప్టెంబర్‌ 2న కేసీఆర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.

ఇదీ చదవండి: ‘బీజేపీని తరిమికొట్టే టైం వచ్చింది’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top