ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..! | Sister-in-law Murder Shocks Family | Sakshi
Sakshi News home page

ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!

Jun 1 2026 7:46 AM | Updated on Jun 1 2026 7:27 PM

Sister-in-law Murder Shocks Family

నిందితురాలు భవ్య, నిందితుడు లల్లు

బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది.  


ఏం జరిగిందంటే..  
వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్‌ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది.  పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు.  

నివ్వెరపోయే నిజాలు.. 
జిల్లా ఎస్పీ కుశాల్‌ చౌక్సె దర్యాప్తులో  అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్‌ డ్రైవర్‌ లోహిత్‌కుమార్‌ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. 

ప్లాన్‌ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement