లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌..

Rs 6 Crore Assets Linked To Lalu Yadav Family In Land For Jobs Scam - Sakshi

పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 

ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్‌ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్‌షీటును దాఖలు చేసింది.

2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్‌ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్‌కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్‌ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. 

ఇదీ చదవండి: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటన: చేతన్‌ షార్ట్ టెంపర్‌.. అందుకే ఈ ఘోరం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top