శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి | RS 5 Must For Booking Slot Of Sabarimala Darshanam | Sakshi
Sakshi News home page

శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి

Nov 1 2025 6:05 PM | Updated on Nov 1 2025 6:35 PM

RS 5 Must For Booking Slot Of Sabarimala Darshanam

శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) షాకిచ్చింది..! ఇకపై www.sabarimalaonline.orgలో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే భక్తులు రూ.5 చొప్పున వెల్ఫేర్ ఫండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఆ మేరకు మండల, మకరవిళక్కు సీజన్‌కు సంబంధించి శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్ ప్రారంభమవ్వగా.. రూ.5 వెల్ఫేర్ ఫండ్ నిర్ణయాన్ని అమలు చేసింది. అంటే.. ఇకపై ఒక్కో స్లాట్‌ బుకింగ్‌కు రూ. 5 చెల్లించాల్సిందే. 

వెల్ఫేర్ ఫండ్ చెల్లిస్తేనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు యాత్రికులకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో  వెల్ఫేర్ ఫండ్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు టీడీబీ పేర్కొంది. 

పేమెంట్ గేట్‌వేలో సమస్యలు:
శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్‌కు యత్నించిన భక్తులకు పేమెంట్ గేట్‌వేలో సమస్యలు తలెత్తాయి. ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు స్లాట్ బుకింగ్‌కు యత్నించడంతో ఈ సమస్య నెలకొని ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: 

శబరిమలకు నేటి నుంచి వర్చువల్‌ బుకింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement