పత్థనంతిట్ట: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల–మకరవిలక్కు పూజలకు సమయం సమీపిస్తున్న వేళ ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ) దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచి్చంది. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇది మొదలవుతుంది. sabarimalaonline.org ద్వారా రోజుకు గరిష్టంగా 70 వేల మంది దర్శనం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని టీడీబీ తెలిపింది. ఇది కాకుండా, స్పాట్ రిజి్రస్టేషన్ల కోసం వండిపెరియార్, ఎరుమెలి, నిలక్కల్, పంబలోనూ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామంది. ఇక్కడ రోజుకు 20వేల మంది వరకు బుక్ చేసుకుని, దర్శనానికి వెళ్లవచ్చని తెలిపింది.


