Just Do The Math: Rahul Gandhi, In US, Predicts Opposition Win In 2024 - Sakshi
Sakshi News home page

ఐక్య ప్రతిపక్షం ఒంటరిగా బీజేపీని మట్టికరిపిస్తుంది: రాహుల్‌ గాంధీ

Published Fri, Jun 2 2023 9:56 AM

Rahul Gandhi In US Predicts Opposition Win In 2024 Just Do Math - Sakshi

వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో ఐక్య ప్రతిపక్షం.. బీజేపీని అధికారం నుంచి దించగలదని అందులో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ధీమాగా చెప్పారు. అమెరికా పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ వాషింగ్టన్‌లో ఉన్న ప్రెస్‌ క్లబ్‌లో కాసేపు ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ చాలా చురుగ్గా పనిచేస్తుందని, ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.  కావాలంటే మీరే గణించండి, ఐక్య ప్రతిపక్షం ఒంటిరిగా బీజేపీని ఎలా మట్టికరిపిస్తుందో చూడండి అని సవాలు విసిరారు.

ప్రతి పక్షం చాలా ఐక్యంగా ఉందన్నారు. మేము అన్ని ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతున్నాము, అక్కడ సానుకూల వాతావరణమే ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్షాల మద్య విభేదాలున్నా వాటిని పక్కకు పెట్టి కలిసి బీజేపీని ఎదుర్కొవాలనుకోవడం నిజంగా చాలా క్లిష్టతరమైన విషయం అని అన్నారు. కచ్చితంగా మహా ప్రతిపక్ష కూటమిగా ఏర్పడుతుందని నమ్మకంగా చెప్పారు. ప్రభుత్వం సంస్థలను స్వాధీనం పరుచుకుంటోందని ఆరోపణలు చేశారు.

నాకు గొప్ప బహుమతి ఇచ్చారు
ఈ సందర్భంగా పరువు నష్టం కేసు విషయం గురించి కూడా రాహుల్‌ ప్రస్తావించారు. తాను పార్లమెంట్‌ సభ్యుత్వాన్ని కోల్పోవడం వల్ల తనకు మంచే జరిగిందన్నారు. ఇది తనని తాను పునర్నిర్వచించుకోవడానికి కలిగిన అద్భుత అవకాశం అన్నారు. వారు నాకు మంచి బహుమతే ఇచ్చారని అనుకుంటున్నానని చెప్పారు. అదే సందర్భంలో తన ప్రాణాలకు బెదిరింపుల గురించి ఆందోళన చెందడం లేదన్నారు.

అందుకోసం అని వెనక్కి తగ్గదిలేదని తేల్చి చెప్పారు. అందరూ ఎప్పుడో ఒకప్పుడూ చనిపోవాల్సిందేనని, అది తన నానమ్మ, తండ్రి చనిపోయినప్పుడే దాని గురించి తాను తెలుసుకున్నానని చెప్పారు. కాగా, రాహుల్‌ నానమ్మ ఇందిరా గాంధీ 1984లో ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురవ్వగా, అతడి తండ్రి 1991లో ఆత్మాహుతి దాడిలో మరణించారు. 

(చదవండి: మహారాష్ట్ర సీఎంతో శరద్‌ పవార్‌ భేటీ! రాజకీయ వర్గాల్లో చర్చ)

Advertisement
Advertisement