మహారాష్ట్ర సీఎంతో శరద్‌ పవార్‌ భేటీ! రాజకీయ వర్గాల్లో చర్చ

NCP Chief Sharad Pawar Meets Maharashtra Chief Minister Eknath Shinde - Sakshi

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారి ఈ విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన షిండేతో శరద్‌ పవార్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీ చాలా ఊహాగానాలకు దారితీసింది. ఐతే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చారు. 

ముంబైలోని మరాఠా మందిర్‌ అమృత్‌ మహోత్సవ్‌ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి షిండేని కలిశానని పవార్‌ ట్వీట్‌ చేశారు. మరాఠీ సినిమా, థియోటర్‌, ఆర్ట్‌ రంగానికి చెందిన కళాకారులు సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు శరద్‌ పవార్‌. మహారాష్ట్ర సీఎం సైతం ఇదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. బీజేపీ కూడా ఈ సమావేశంపై స్పందించింది. ఈ భేటికీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరణ ఇవ్వడం గమనార్హం. 

(చదవండి: నేను బీజేపీకి చెంది ఉండవచ్చు.. కానీ బీజేపీ నా పార్టీ కాదు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top