చిన్నారులతో పానీపూరీ తిన్న రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Enjoys Dinner In Srinagar | Sakshi
Sakshi News home page

చిన్నారులతో పానీపూరీ తిన్న రాహుల్‌ గాంధీ

Aug 22 2024 10:58 AM | Updated on Aug 22 2024 11:05 AM

Rahul Gandhi Enjoys Dinner In Srinagar

శ్రీనగర్‌ను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఒక రెస్టారెంట్‌లో చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ హోటల్‌ అహ్దూస్‌లో విందు ఆరగించారు. అలాగే చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు.

శ్రీనగర్‌లోని వ్యూ రెసిడెన్సీ రోడ్‌ ప్రాంతంలో రాహుల్‌ గాంధీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.  ఆయన బసచేసిన హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఈ హోటల్‌లో రాహుల్‌ గాంధీ ఎవరికి కలుసుకున్నారనేది వెల్లడికాలేదు.
 

కాగా రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆయనకు పలు సవాళ్లు విసిరింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏపై రాహుల్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని  బీజేపీ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకు రాహుల్‌కు అవకాశం ఏర్పడిందని బీజెపీ ప్రధాన కార్యదర్శి  తరుణ్ చుగ్ అన్నారు. కాంగ్రెస్‌ కొన్ని దశాబ్దాల పాటు జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదం, ఉగ్రవాద వాతావరణానికి ఆజ్యం పోశాయని ఆరోపించారు. అయితే 2014లో కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement