Bharat Jodo Yatra: ఎట్టకేలకు జాకెట్‌ ధరించిన రాహుల్‌..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు

Rahul Gandhi Jodo Yatra Enters Kashmir Seen In Jacket First Time - Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు 125 రోజుల ప్రయాణంలో సుమారు 3,400 కిలోమీటర్లు చేసిన పాద యాత్రలో కేవలం తెల్లటి టీషర్ట్‌ మాత్రమే ధరించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. చలికాలం సమీపించి గజగజలాడిస్తున్న ఆయన తెల్లటి టీ షర్ట్‌ మాత్రమే ధరించడం అందరిలో ఒకటే ఉత్సుకతను రేకెత్తించాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి రాహుల్‌ని ఈవిషయమై ప్రశ్నించగా..పేదవాళ్లను, కార్మికులను ఈ ప్రశ్న ఎందుకు వేయరు అని ఎదురు ప్రశ్నించారు.

తాను ముగ్గురు చిన్నారులన చూశానని వారు చలికి వణకుతూ కనిపించారే గానీ స్వెటర్లు ధరించలేదని, వారే తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారికి చలి అనిపించేంత వరకు తాను ధరించనని, అప్పటి వరకు తనకు కూడా చలిగా అనిపించదంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి జమ్మూలో యాత్ర ప్రవేశించగానే రాహుల్‌కి జాకెట్‌ ధరించక తప్పలేదు. ఈ మేరకు గురువారం రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌ నుంచి జమ్మూలోకి ప్రవేశించింది. చలికాలంలో సైతం టీషర్టు ధరించి ఉత్తర భారతదేశం గుండా దిగ్విజయంగా పాదయాత్ర చేసి అందర్నీ షాక్‌ గురిచేసిన ఆయన ఈరోజు యాత్రలో తోలిసారిగా జాకెట్‌లో కనిపించారు.

ఉదయం నుంచి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చినుకులు కురుస్తుండటం వల్ల గాంధీ చివరకు రక్షణ దుస్తులు ధరించక తప్పింది కాదు. దీంతో ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు రాహుల్‌పై వ్యంగోక్తులు విసరడం, చురకలింటించడం, ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, రాహుల్‌ జనవరి 25న  జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలోని బనిహాల్‌లో జాతీయ జెండాను ఎగరువేస్తారు. ఆ తర్వాత రెండురోజలు అనంతరం జనవరి 27న అనంత్‌నాగ్‌ మీదుగా శ్రీనగర్‌లో ప్రవేశించనున్నారు.

అదీగాక భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో నడవవద్దని భద్రతా సంస్థలు గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ జమ్మూలో ప్రవేశించగానే అక్కడి అగ్రనేత నేషనల్‌కాన్ఫరెన్స్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. పైగా చివరి దశకు చేరుకున్న ఈ యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో గ్రాండ్‌ ఫినాలేతో ముగుస్తుంది. 

(చదవండి: యూత్‌ ఐకాన్‌గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top