మైనార్టీలపై దాడిచేసిన వారితో దోస్తీనా! | Rahul Gandhi Alleges Kerala CM Vijayan Alliance with Attacking Minorities | Sakshi
Sakshi News home page

మైనార్టీలపై దాడిచేసిన వారితో దోస్తీనా!

Apr 5 2026 5:44 AM | Updated on Apr 5 2026 5:44 AM

Rahul Gandhi Alleges Kerala CM Vijayan Alliance with Attacking Minorities

కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంపై రాహుల్‌ నిప్పులు

అలప్పుజ/ఇడుక్కి/కొచ్చి: మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌ల లో మైనార్టీలపై దారుణ దాడులకు తెగబడిన బీజేపీతో కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి అంటకాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణల నిప్పులు కురిపించారు. కేరళ శాసనసభ ఎన్నికల సందర్భంగా శనివారం అలప్పుజ, ఇడుక్కి, ఇర్నా కులం జిల్లాలోని కట్టప్పణ, ఫోర్ట్‌ కొచ్చి, కున్నథునాడ్‌ల లో ప్రచార ర్యాలీల్లో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు.

 ‘‘ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నర్సులపై దాడులు జరిగా యి. మణిపూర్‌లో చర్చిలను తగలబెట్టారు. ఇలాంటి హే యదాడులకు పాల్పడుతు న్న (బీజేపీ) వాళ్లతో సీఎం విజయన్‌ చెలిమి చేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు లపై దాడిచేసే వాళ్లతో సీఎం రహస్య పొత్తు పెట్టుకున్నా రు. వామపక్ష సిద్ధాంతాలు ఒంటబట్టించుకుని కూడా సీఎం ఎలా ఇలాంటి వాళ్లతో జతకడతారు? ఆయన కు కనీసం సిగ్గు అన్పించట్లేదా? దీనికి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. 

తన కుమార్తె (వీణ)ను ఒక కేసు నుంచి కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తునకు, ప్రధాని మోదీకి సీఎం భయపడుతున్నారు’’ అని అన్నారు. కేరళలో వెలుగుచూసిన కొచ్చి మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌), ఎక్సోలాజిక్‌ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని వీణపై కేసు నమోదవడం తెల్సిందే. ‘‘మన వామ పక్ష నేత(సీఎం) తన కుమార్తెను కాపాడుకునేందుకు మతవాద(బీజేపీ) పార్టీ పంచనచేరారు. 

తన పిల్లల కోసం సీఎం ప్రజలను గాలికొదిలేశారు. మతవాద పార్టీ ఎలా ఆడిస్తే సీఎం అలా ఆడుతు న్నారు’ అని రాహుల్‌ అన్నారు. ‘‘ఎల్‌డీఎఫ్‌ను అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ అదృశ్య శక్తి ఒక మత శక్తి. అది భారతరాజ్యాంగాన్ని యథాతథంగా ఒప్పుకోదు. విడగొట్టడం, విద్వేషం రెచ్చగొట్టడం దాని ఏకైక లక్ష్యం. కేరళలో ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, సీపీఐ(ఎం) బంధాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని అన్నా రు. ‘‘అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా మోదీ సర్కార్‌ ఏ దేశం నుంచీ చము రు కొనలేని దుస్థితి దాపురించింది.

 ఏ దేశం నుంచి మనం చమురు, గ్యాస్‌ కొనాలో ట్రంపే నిర్ణయిస్తున్నారు’’ అని రాహుల్‌ ఆరోపించారు. ‘‘కేరళలో రైతులకు ఎల్‌డీఎఫ్‌ సర్కార్‌ నుంచి తోడ్పాటు కరువైంది. తేయాకు, రబ్బర్, యాలకుల సాగు తగ్గిపోయింది. రైతులు రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ఇడుక్కిలో వైద్యసంరక్షణ వ్యవస్థ నాశనమైంది. అందుకే అత్యవసర వైద్యం కోసం జనం కొట్టాయంకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం లేదు. మేం అధికారంలోకి వస్తే యూడీఎఫ్‌ కూటమి హామీలను నెరవేరుస్తుంది’’ అని రాహుల్‌ భరోసా ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement