పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె మాట్లాడుతూ, ఆయనను పోటీ చేయనివ్వాలని, ఆయన తన ప్రాతినిధ్య స్థానం నుంచే పోటీ చేస్తున్నారని అన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అమ్మేసిందని, డబ్బంతా ప్రధాని మోదీ ఇంటికి చేరిందని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 70 వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని, కానీ దానిపై ఎక్కడా చర్చ జరగలేదన్నారు. లాలూ ఎలాంటి తప్పు చేయలేదని, తాము కోర్టులో కేసును ఎదుర్కొంటామన్నారు. తన మరో కుమారుడు, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విజయంపై రబ్రీ దేవి నమ్మకం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.
#WATCH | Raghopur East, Bihar | #BiharElection2025 | RJD leader Rabri Devi says, "Nitish Kumar will not become the Chief Minister of Bihar..."
On her son and Janshakti Janata Dal (JJD) Chief Tej Pratap Yadav contesting elections, she says, "It is fine, let him contest, he is… pic.twitter.com/Uo7C55up3e— ANI (@ANI) October 30, 2025
రఘోపూర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిని చేస్తారని రబ్రీ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘోపూర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా మహాకూటమి తాజాగా ‘బీహార్ కా తేజస్వి ప్రాణ్’ అనే పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దానిలో ప్రజలకు పలు హామీలనిచ్చింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి


