నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌ | PM Modi Speaks To Maharashtra Tamil Nadu MP Himachal Pradesh CMs | Sakshi
Sakshi News home page

నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌

May 8 2021 4:19 PM | Updated on May 8 2021 5:10 PM

PM Modi Speaks To Maharashtra Tamil Nadu MP Himachal Pradesh CMs - Sakshi

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కోవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తి కట్టడికై తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: ఉద్ధవ్‌ ఠాక్రే
కరోనా సెకండ్‌వేవ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోంటందన్న అంశంపై ప్రధాని మోదీ వివరాలు కోరారు. కోవిడ్‌-19 కట్టడికై ఎలాంటి చర్యలు చేపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. ఆక్సీజన్‌ కొరత లేకుండా సహాయం అందించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. అదే విధంగా.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న తీరును వివరించారు. ఎప్పటికప్పుడు కోవిడ్‌ పరిస్థితిపై సమీక్ష జరుపుతూ విలువైన సూచనలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను మన్నిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్‌ఠాక్రే సంభాషణ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌ వేదికగా వివరాలు వెల్లడించింది.

చదవండి: కరోనా విలయం: డీఆర్‌డీవో డ్రగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement